పాపం కానిస్టేబుల్ కు కరోనా కష్టం.. కన్నతల్లి ని కడసారి చూసుకోలేని దైన్యం!

పాపం కానిస్టేబుల్ కు కరోనా కష్టం.. కన్నతల్లి ని కడసారి చూసుకోలేని దైన్యం!
x
Highlights

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా ఓ కానిస్టేబుల్ తన తల్లి కడచూపునకు నోచుకోలేకపోయాడు. హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు...

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా ఓ కానిస్టేబుల్ తన తల్లి కడచూపునకు నోచుకోలేకపోయాడు. హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో గౌరీ నాయుడు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి ఎల్లమ్మ(48), వీరి స్వస్థలం విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండలంలోని మెట్టపల్లి గ్రామం. కాగా కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయడంలో నిమగ్నమైన గౌరినాయుడికి శనివారం తల్లి అనారోగ్యంతో మృతిచెందిన సమాచారం అందింది.

లాక్‌డౌ న్‌తో రాష్ట్ర సరిహద్దులు మూసుకుపోవడంతో తన తల్లిని కడసారి చూ సుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆదివారం తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన గౌరీనాయుడు గుండెదిటవు చేసుకు ని బాధ్యతలు నిర్వర్తించాడు. విషయం తెలిసిన సహోద్యోగులు అతడిని ఓదార్చి సంఘీభావం తెలిపారు. తల్లి అంత్యక్రియలను వీడియో కాల్‌ ద్వారా వీక్షించిన కానిస్టేబుల్‌ గౌరినాయుడిని సీఐలు అంజిరెడ్డి, మక్బూల్‌ జానీ, ఎస్సై రఘురాం పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories