కారు దాటికి బద్ధలైన కాంగ్రెస్ కంచుకోట

కారు దాటికి బద్ధలైన కాంగ్రెస్ కంచుకోట
x
Highlights

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. హస్తం కంచుకోటకు బీటలు వారాయి. కారు జోరుకు కాంగ్రెస్ నిలవలేకపోయింది. మూడు సార్లు ఎన్నికల్లో సత్తాచాటిన...

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. హస్తం కంచుకోటకు బీటలు వారాయి. కారు జోరుకు కాంగ్రెస్ నిలవలేకపోయింది. మూడు సార్లు ఎన్నికల్లో సత్తాచాటిన కాంగ్రెస్ ఉపఎన్నికల్లో మాత్రం డీలా పడింది. ఉత్తమ్ వ్యూహాలు, ఆర్టీసీ సమ్మె టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేకపోయాయి.

ప్రతీ రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి వెనుకంజలో ఉండిపోయారు. పట్టున్న మండలాల్లో సైతం వెనుకపడిపోవడంతో నిరాశ చెందారు. కాంగ్రెస్‌ బలంగా ఉండే నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో సైతం నెట్టుకురాలేకపోయారు. ఉప ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోవడంతో పద్మావతి నిరాశలో మునిగిపోయారు. కౌంటింగ్ సెంటర్‌ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. పద్మావతి గెలిస్తే ఉత్తమ్‌కు లాభం సైదిరెడ్డి గెలిస్తే హుజూర్‌నగర్ నియోజకవర్గానికి లాభమని టీఆర్ఎస్ చేసిన ప్రచారం హస్తం పార్టీని దెబ్బకొంటిందని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories