ఊసరవెల్లిలా సీఎం కేసీఆర్‌: రేవంత్‌

ఊసరవెల్లిలా సీఎం కేసీఆర్‌: రేవంత్‌
x
Highlights

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీఎం...

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తమ ఉద్యోగాలను కూడా పణంగా పెట్టి నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాట పటిమను టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో పొగిడారని రేవంత్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని మాటిచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శలు గుప్పించారు. ఆయన ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంగతేమో గానీ.. ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆర్టీసీ కార్మికులనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదంటూ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories