రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ... బెయిల్ పిటిషన్ కొట్టివేత

రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ... బెయిల్ పిటిషన్ కొట్టివేత
x
Revanth Reddy (File Photo)
Highlights

మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను మియాపూర్‌ కోర్టు తిరస్కరించింది. ఈ మధ్యకాలంలో కేటీఆర్ ఫాంహౌస్ మీద అనుమతులు లేకుండా డ్రోన్ ఎగరేశారనే ఆరోపణలతో పోలీసులు రేవంత్ రెడ్డిని ఈ నెల 6వ తేదీ అరెస్ట్ చేశారు.

మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను మియాపూర్‌ కోర్టు తిరస్కరించింది. ఈ మధ్యకాలంలో కేటీఆర్ ఫాంహౌస్ మీద అనుమతులు లేకుండా డ్రోన్ ఎగరేశారనే ఆరోపణలతో పోలీసులు రేవంత్ రెడ్డిని ఈ నెల 6వ తేదీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కాగా రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించి, నార్సింగి పోలీసు స్టేషన్‌లో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరుతూ కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.

2020 మార్చి 1వ తేదీన ఎంపీ రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కృష్ణారెడ్డి సలహా తీసుకున్న విజయ్‌పాల్‌రెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, వారి స్నేహితుడు విజయ్‌సింహారెడ్డి జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ ఆఫీస్‌కు వెల్లారు. అక్కడి నుంచి వారంతా డ్రోన్‌ కెమెరాతో ఫాం హౌస్ చిత్రీకరణ కోసం కోకాపేటకు వెళ్లి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తిని కలిశారు. ఈ తరువాత జైపాల్‌రెడ్డి అక్కడే ఉండే ఓం ప్రకాశ్‌రెడ్డి అని యువకుడిని వారికి పరిచయం చేసారు.

వారందరూ డ్రోన్‌ కెమెరా సాయంతో అనుమనతులు లేకుండా వారు అనుకున్న ప్రాంతంతో పాటు చుట్టు పక్కన పరిసర ప్రాంతాలను కూడా చిత్రీకరించారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి కార్యాలయానికి చేరుకొని పూర్తి సమాచారాన్ని కృష్ణారెడ్డికి అందజేశారు. ఈ సంఘటనపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు బుధవారం వారిని అరెస్ట్ చేసి వారిపై 224/2020లో సెక్షన్‌ 184,187 ఐపీసీ, 11ఏ రెడ్‌ విత్‌ 5ఏ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కింద అభియోగాలు మోపారు.

ఇక పోతే ఈ విషయం పై ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జన్వాడ దగ్గర అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని ఆయన ఆరోపించారు. రూ. 250 కోట్ల విలువైన ఈ భూమిలో రూ. 25 కోట్లు పెట్టి కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని విమర్శించారు. ఈ విషయాలను వెల్లడి చేయడానిక రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, అందుకే ఆయన్ని అరెస్ట్ చేసారని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories