ప్రధాని మోడీని కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి

ప్రధాని మోడీని కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి
x
Highlights

ప్రధాని మోడీతో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు చెందిన పలు అంశాలను ఎంపీ మోడీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌...

ప్రధాని మోడీతో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు చెందిన పలు అంశాలను ఎంపీ మోడీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ఆపివేయాలని కోరారు. హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారిగా చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా కాపర్,జింక్, ఇతర విష పదార్థాలు మూసినది నీటిలో మోతాదుకు మించి కలుస్తున్నాయని కోమటిరెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దాంతోపాటు మూసినది శుధ్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించాలని కోమటిరెడ్డి ప్రధానిని కోరారు. సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని కోరానని కోమటిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories