ఆరువేల మంది రైతుల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఆరువేల మంది రైతుల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు:  ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
x
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Highlights

తెలంగాణలో రైతులకు ఇచ్చిన పంట రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు.

తెలంగాణలో రైతులకు ఇచ్చిన పంట రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు ఎకరాల లోపు ఉన్నవారికే రైతు బంధు ఇస్తున్నారన్నారు. వడ్డీ రాయితీ కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన రాయితీలు నిలిపివేయడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

ఆంక్షలు లేకుండా రైతు బంధు అమలు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో హామీలిచ్చారని తెలిపారు. రైతులకు ఇచ్చిన రుణాలలో లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదర్కొన్నారని తెలిపారు. ఇప్పటి వరకూ ఆరువేల మంది రైతుల అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు 6 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఉత్తర్వులు అమలు చేయడం లేదని మండిపడ్డారు.

ఎకరానికి రెండు క్వింటాలు కందులు కొనుగోలు చేస్తామని చెప్పడం భావ్యం కాదన్నారు. రాష్ట్రంలో రైతు బీమా 59 ఏళ్ల లోపు వారికి మాత్రమే వర్తింపచేస్తున్నారని ఆయన తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వం రైతు బంధును నిర్వీరం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్‌లో సమావేశాల్లో కూడా చర్చిస్తామని వెల్లడించారు. పసుపు క్వింటాలుకు 10వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని ఆయన తెలిపారు.కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై చర్చించామని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories