తెలంగాణలో ప్రతి కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి: భట్టి

తెలంగాణలో ప్రతి కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి: భట్టి
x
Highlights

చింతమండకలో ప్రతి కుటుంబానికి రూ. పది లక్షలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని...అదే విధంగా రాష్ర్టంలోని అన్ని కుటుంబాలకు పది రూ. లక్షలు ఇవ్వాలని డిమాండ్...

చింతమండకలో ప్రతి కుటుంబానికి రూ. పది లక్షలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని...అదే విధంగా రాష్ర్టంలోని అన్ని కుటుంబాలకు పది రూ. లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గురువారం అసెంబ్లీ హాల్ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ పది లక్షల చొప్పున పంపిణీ చేయాలని కోరారు. సీఎంగా చింతమడక గ్రామానికే సహాయం చేస్తే ఇతర ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేసిన వారవుతారన్నారు. అందరికీ న్యాయం చేయలేని పక్షంలో ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత వచ్చి ఆసహానం వెళ్ళగక్కే ప్రమాదం ఉందని హితవు చెప్పారు. ఇదే విషయం సీఎం కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు చెప్పారు. అయితే ఆ పథకానికి చింతమడక స్కీమ్‌ అని పెడితే అభ్యంతరం లేదన్నారు. ఉనికి కోసమే ఆ పార్టీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ కాంగ్రెస్ పై ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారని భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాగా కాళేశ్వరంను ఎడిటర్‌లకు చూపిస్తాను అని చెప్పడం మంచి నిర్ణయమే అని అన్నారు భట్టి. అయితే కాళేశ్వరం పేరు మీద అప్పులను, DPR (డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) లను కూడా ఎడిటర్‌లకు అందించాలని చెప్పారు. శాసనసభలో తాను కాళేశ్వరం DPRని ప్రతీ ఎమ్మెల్యేకు ఇవ్వాలని అడిగానని ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకున్నారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యేలకు కూడా DPR ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా DPRను ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ఇప్పటికైనా ఇవ్వాలి డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories