Top
logo

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని...

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రాజెక్టు ద్వారా సంగారెడ్డి ప్రజల నీటి కష్టాలు తీరుతాయన్నారు. కాళేశ్వరంలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉన్నట్లేనని చెప్పారు. కాళేశ్వరం ప్రారంభమైన ఒక సంవత్సరంలో కాలువలు తవ్వి సింగూరు - మంజీరాను నింపాలని కేసీఆర్‌ను కోరారు. అలా చేస్తే ప్రజల తరపున కేసీఆర్‌కు ఘనంగా సన్మానం చేస్తానన్నారు జగ్గారెడ్డి. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్, ఫడ్నవిస్‌ను పిలవడంలో తప్పులేదన్నారు.

Next Story