Top
logo

దేశ చరిత్రలో ఇన్ని రోజులు ఆర్టీసీ సమ్మె ఎన్నడూ జరగలేదు : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

దేశ చరిత్రలో ఇన్ని రోజులు ఆర్టీసీ సమ్మె ఎన్నడూ జరగలేదు :  ఎమ్మెల్యే జగ్గారెడ్డి
X
Highlights

దేశ చరిత్రలో ఇన్ని రోజులు ఆర్టీసీ సమ్మె ఎన్నడూ జరగలేదన్నారు టీ కాంగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కళ్లుండి చూడలేని,...

దేశ చరిత్రలో ఇన్ని రోజులు ఆర్టీసీ సమ్మె ఎన్నడూ జరగలేదన్నారు టీ కాంగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని స్థితిలో తెలంగాణ ఉందన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో ఇంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా.? అని మండిపడ్డారు జగ్గారెడ్డి. తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవు అని సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు సమ్మె జరగడం దురదృష్టకరమన్నారు. 40 రోజులుగా సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సమ్మెకు డెడ్‌లైన్‌ ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదని, ఆర్టీసీ కార్మికులకు మేలు చేయాల్సింది పోయి కీడు చేస్తున్నారని ఆరోపించారు. మహబూబాబాద్‌లో ఆర్టీసీ కార్మికుడు ఆవుల నరేష్‌ చనిపోవడం బాధాకరమని, కార్మికుల మృతిపై ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు.


Next Story