తెలంగాణా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ?

తెలంగాణా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ?
x
Highlights

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి...

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే . అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం తెలంగాణా కాంగ్రెస్ కమిటి చీఫ్ లను మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది . ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో అధిష్టానం చర్చలు కూడా జరిపినట్టు సమాచారం . తెలంగాణా పీసీసీ చీఫ్ పదవికి చాలా మంది పేర్లు వినిపించాయి . అందులో ఎంపీలు రేవంత్ రెడ్డి , కొమిటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు వినిపించాయి . కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది . యూత్ లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపారని సమాచారం . ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు . తాజాగా అయన నల్గొండ నుండి ఎంపీగా గెలిచినా సంగతి విధితమే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories