రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం.. 20 ఎకరాల ఫామ్‌హౌస్‌ అవసరమా..? : జీవన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం.. 20 ఎకరాల ఫామ్‌హౌస్‌ అవసరమా..? : జీవన్‌రెడ్డి
x
రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం
Highlights

అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా డ్రోన్‌ కెమెరా ఉపయోగించారని రేవంత్‌ను అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి....

అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా డ్రోన్‌ కెమెరా ఉపయోగించారని రేవంత్‌ను అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. మీ విలాసవంతమైన జీవితం కోసం 20 ఎకరాల ఫామ్‌హౌస్‌ అవసరమా అని ప్రశ్నించారు. అక్రమాలను బయటపెట్టినందుకు రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు.

ఓ ఎంపీని అరెస్టు చేయించి అక్రమంగా జైలుకు పంపారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేటీఆర్‌కు సంబంధించిన ఫామ్‌ మౌస్‌ను డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. బేషరతుగా రేవంత్ పై పెట్టిన కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories