కరోనా భయంతో గజ్వేల్ ఫాంహౌస్‌కు సీఎం వెలితే.. రాజధాని పౌరులు ఎక్కడికి వెళ్లాలి...

కరోనా భయంతో గజ్వేల్ ఫాంహౌస్‌కు సీఎం వెలితే.. రాజధాని పౌరులు ఎక్కడికి వెళ్లాలి...
x
KCR, Vijayashanthi (File photo)
Highlights

తెలంగాణ సిఎం కేసీఆర్ పై సినీ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ విజయశాంతి తీవ్ర విమర్శలు చేసారు.

తెలంగాణ సిఎం కేసీఆర్ పై సినీ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ విజయశాంతి తీవ్ర విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ కరోనా భయం పట్టుకుందని, ఆ భయంతో సీఎంగారు తమ గజ్వేల్ ఫాంహౌస్‌కు వెళ్ళిపోయారట. మరి రాజధాని పౌరులు ఎక్కడికి వెళ్లి తమ ప్రాణాలు రక్షించుకోవాలో అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దాంతోపాటుగానే మరో ట్విట్ లో తెలంగాణలో రోజుకొకటిగా కరోనా కేసుల పెరుగుదల నమోదు ప్రకటించబడుతూఉంది.హైదరాబాదులో ఈ సమస్య ఉంటుందని జిల్లాల్లో అంతగా ఉండదని ప్రకటించిన సీఎందొరగారు తమ భద్రత దృష్ట్యా రాజధానిలోని తమ అధికార నివాసం ప్రగతిభవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ దగ్గర ఫాంహౌస్‌లో ఉంటున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా బుధవారం సాయంత్రం, గురువారం ఉదయం ఇదే విధంగా ట్వీట్ చేసారు విజయశాంతి. అంతే కా

కరోనా మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్యా నిన్న ఒక్కసారిగా పెరిగింది. అదే కోవలో తెలంగాణా లో కూడా కేసుల సంఖ్య పెరిగిపోయింది. నిన్న ఒక్కరోజే తెలంగాణా లో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ నిన్న రాత్రి (బుధవారం, మార్చి18) ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక్కసారే ఇన్ని పాజిటివ్ కేసులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ బాధితులందరూ ఇండోనేషియాకు చెందినవారిగా గుర్తించారు. ఈ 9 కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13 కు చేరుకుంది. దేశంలో తెలంగాణా కేసుల నమోదులో మూడో స్థానానికి తెలంగాణా చేరుకుంది. ఇండోనేషియా నుంచి కొన్ని రోజుల క్రితం మతపరమైన కార్యక్రమాల కోసం కొంతమంది భారత దేశం వచ్చారు. వారిలో కొందరు ఢిల్లీ నుంచి రైలు మార్గంలో తెలంగాణా లోని కరీం నగర్, రామగుండం పరిసర ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. వీరు అక్కడి మసీదుల్లో షెల్టర్ తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో వీరు ఆ ప్రాంతాల్లో ఎంతమందితో కలిసారనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా బారిన పడిన వీరిని మార్చి 16 నుంచి ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటివరకూ తెలంగాణా లో నమోదైన కరోనా కేసులు మొత్తం విదేశీయులే కావడం, వారిలో అత్యధికులు ఇండోనేషియా వారే కావడం గమనార్హం. ఇప్పటివరకూ తెలంగాణా లోని స్తానికులేవరూ కరోన బారిన పడలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన విదేశీయులలో కరోనా లక్షణాలు కనబడినట్టు తేలడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అప్రమత్తం చేశారు. కరోనా ప్రభావం విషయంపై ఈరోజు (19 మర్చి) మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి సమీక్షించి, అవసరమైతే మరిన్ని చర్యలు వేగవంతంగా తెస్సుకోవడానికి నిర్ణయం చేసే అవకాశాలున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories