Top
logo

కేటీఆర్‌కు విజయశాంతి కౌంటర్

కేటీఆర్‌కు విజయశాంతి కౌంటర్
Highlights

టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు. తన వరకు వస్తే కానీ అసలు తత్వం బోధపడదన్న చందంగా కేటీఆర్ నిర్వేదం ఉందని ఆమె విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు. తన వరకు వస్తే కానీ అసలు తత్వం బోధపడదన్న చందంగా కేటీఆర్ నిర్వేదం ఉందని ఆమె విమర్శించారు. తమతో కలవని వాళ్లను దేశద్రోహులుగా ముద్రవేస్తూ బీజేపీ రాజకీయం చేస్తోందన్న కేటీఆర్‌‌‌‌ కామెంట్లకు ఆమె కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్ళ కాలంలో టీఆర్ఎస్ అధిష్టాన వైఖరిని చూస్తూ ఉంటే… తమతో కలిసి ఉన్న వారే తెలంగాణ వాదులు… లేకపోతే తెలంగాణ ద్రోహులు అనే విధంగా నియంతృత్వ ధోరణి కనిపించిందని ఆమె విమర్శించారు. ఈరోజు కేటీఆర్ అభిప్రాయం ఎలా ఉందో సరిగ్గా అదే అభిప్రాయంతోనే ఇంతకాలం ప్రతిపక్షాలన్నీ అంతర్మథనంతోను.. ఆవేదనతోను కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇప్పటికైనా అసలు తత్వం టిఆర్ఎస్ అధిష్టానానికి బోధ పడినందుకు సంతోషమని ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లోనైనా టిఆర్ఎస్ అగ్ర నాయకత్వం తన వైఖరిని మార్చుకోవాలని ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని విజయశాంతి ట్వీట్ చేశారు.


లైవ్ టీవి


Share it
Top