టీఎస్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర: భట్టి విక్రమార్క

టీఎస్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర: భట్టి విక్రమార్క
x
Highlights

ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే ఆలోచన లేదని విమర్శించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆర్టీసీ కార్మికులతో చర్చలు...

ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే ఆలోచన లేదని విమర్శించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాల్సింది పోయి ప్రభుత్వం బెదిరింపులకు దిగిందని మండిపడ్డారు. భయపెట్టి ఆదేశిస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. సీఎం ఒక్క మాటతో ఉద్యోగాల నుంచి తీసేస్తారా? అని భట్టి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారం తలకెక్కి పరాకాష్టకు చేరిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇదేనా? అని భట్టి ప్రశ్నించారు. సకల జనుల సమ్మె సమయంలో కార్మికులపై లాఠీ విరగలేదని, ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసేయలేదని.. అప్పటి సీఎం కూడా కేసీఆర్‌లా ప్రవర్తించలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నా, ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories