రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ షాక్.. తొలుత వేటు వేయాలని నిర్ణయం

రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ షాక్.. తొలుత వేటు వేయాలని నిర్ణయం
x
Highlights

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ చిచ్చు రేపుతోంది. నాయకత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని...

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ చిచ్చు రేపుతోంది. నాయకత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సీరియస్ గా తీసుకుంది. రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని మోడీని పొగడుతున్నారంటే రాహుల్ గాంధీని అవమానించడమేనని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ సంఘం రాజగోపాల్ రెడ్డిని కోరింది. మరో వైపు పార్టీ మార్పుపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు రాజగోపాల్ రెడ్డి.

రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలకు పార్టీ నాయకత్వంతో పాటు. క్రమశిక్షణ కమిటీ కూడా వేటు వేయాలని భావించింది. కానీ వేటు వేస్తే రాజగోపాల్ రెడ్డికి మేలు చేసినట్టవుతుందని భావించి షోకాజ్ నోటీసులతో సరిపెట్టింది. ఇప్పటికే కోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేసు నడుస్తోంది. రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తే ఆయన కూడా పార్టీ ఫిరాయింపుల పిటిషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతోముందు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని పార్టీ నాయకత్వం భావించింది. అయితే పార్టీ మార్పుపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీకి వచ్చాన్నారు.అంతే కాదు తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు రాజగోపాల్ రెడ్డి. ఏపీలో జగన్‌లా పోరాటాలు చేసి ఉంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు. తాను పార్టీ మారడం లేదన్న ఆయన నియోజకవర్గ ప్రజలు, అనుచరులను సంప్రదించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని తేల్చి చెప్పారు.

రాజగోపాల్ రెడ్డికి క్రమ శిక్షణా కమిటీ నోటీసులు ఇవ్వటం ఇది మొదటి సారి కాదు గతంలో పార్టీ సమావేశంలోనే గూడూరు నారాయణరెడ్డి పై దాడి విషయంలో నోటీసులు ఇచ్చింది. ముందస్తు ఎన్నికల సమయంలో కుంతియా పీసీసీ పై చేసిన ఆరోపణలు క్రమంలో కూడా నోటీసులు అందుకున్నారు. ఒకానొక దశలో పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని ప్రకటనలు కూడా వచ్చాయి అయినా అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యంతో వ్యవహారం నోటీసులతో సరిపెట్టింది పార్టీ. తాజాగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా నోటీసులు జారీచేసింది. ఇలా రాజగోపాల్ రెడ్డికి నోటీసులు పంపడం ఇది మూడో సారి.ఇక ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా పార్టీ గీత దాటిన నాయకుల వ్యవహారం పై కూడా కమిటీ చర్చించింది. కమిటీ ముందు హాజరుకావాలని కమిటీ నోటీస్ లు పంపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories