25 మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులు: కలెక్టర్ శ్వేతా మహంతి

25 మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులు: కలెక్టర్ శ్వేతా మహంతి
x
Highlights

ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యలను తీర్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యలను తీర్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్వేతా మహంతి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె ఆర్జీలు స్వీకరించారు.

ఇక ఈ కార్యక్రమానికి 25 మంది అధికారులు హాజరు కాకపోవడంతో ఆమె వారిపై మండిపడ్డారు. అనంతరం వారికి షోకాజ్‌ నోటీసులను జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. ఇక మీదట హాజరు కాకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఇక పోతే గతంలో కూడా ప్రజావాణి కార్యక్రమంలో ఇదే విధంగా అధికారులు గైర్హాజరవుతూ వచ్చారని తెలుస్తోంది. గత రెండేళ్లుగా ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా సాగుతూ వచ్చింది. ప్రజావాణిలో ప్రజల సమస్యలు పరిష్కారం కాదు కదా అసలు వినేవారే కరువయ్యారు. తాజాగా కలెక్టర్‌గా శ్వేతా మహంతి పాలనా పగ్గాలు చేపట్టడంతో కొంత ఆశలు చిగురించాయి. కానీ అధికారుల తీరు మారక పోవడంతో కలెక్టర్‌ కన్నెర్ర చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఎం.కృష్ణ, రెవెన్యూ అధికారులు శ్రీను, వసంత కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories