వైరలైన టీచర్ల టిక్‌ టాక్.. షాకిచ్చిన కలెక్టర్

వైరలైన టీచర్ల టిక్‌ టాక్.. షాకిచ్చిన కలెక్టర్
x
Highlights

ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడ, ఎవ్వరిని చూసినా స్మార్ట ఫోన్ లనే ప్రపంచంగా భావిస్తున్నారు. అందులోనే ఆటలు ఆడడం, పాటలు వినడం ఇలా ఏ పని చేయాలన్నా స్మార్ట్ ఫోన్ నే ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడ, ఎవ్వరిని చూసినా స్మార్ట ఫోన్ లనే ప్రపంచంగా భావిస్తున్నారు. అందులోనే ఆటలు ఆడడం, పాటలు వినడం ఇలా ఏ పని చేయాలన్నా స్మార్ట్ ఫోన్ నే ఉపయోగిస్తున్నారు. అంతేనా ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరి సెల్ ఫోన్లలో ఉన్న యాప్ టిక్ టాక్. ఈ టిక్ టాక్ జనాన్ని ఊపేస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆ వీడియోల మోజులో పడి టిక్‌టాక్‌లో మునిగి తేలుతున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ బానిసలైపోతున్నారు. ఈ టిక్ టాక్ వీడియోల పిచ్చితో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారు.

అంతే కాక యువకులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఇంకొంత మంది ఐతే ఏకంగా వీడియోలను చేస్తూ తమ ప్రాణాలకు కూడా పోగొట్టుకుంటున్నారు. అయినా చాలా మంది ఈ వీడియోలను చేయడం మానేయకుండా తమలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ఇదే నేపథ్యంలో ఓ గురుకుల కళాశాల అమ్మాయిలతో ముగ్గురు లేడీ టీచర్లు టిక్ టాక్ వీడియో చేసి కొత్త చిక్కులు తెచ్చుకున్నారు. వారు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఏకంగా వారిని విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

పూర్తివివరాల్లోకెళితే కొత్తగూడెం పట్టణం రామవరంలోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ (టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ)లో పార్ట్‌ టైం ఉపాధ్యాయినులుగా పని చేస్తున్న వి కృష్ణవేణి, బి స్రవంతి, బి మౌనిక విద్యార్థులతో కలిసి టిక్‌ టాక్‌ వీడియోలు చేశారు. హిందీ పాటలను ప్లే చేస్తూ విద్యార్థలతో కలిసి స్టెప్పులేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతొ విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లే పిల్లలను చెడగొడుతున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతే కాదు వారికి భయం చెప్పాల్సిన మీరే కాలేజీ అమ్మాయిలతో కలిసి గంతులేస్తారా అని వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ విషయం కాస్త కొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి దృష్టి తెలిసింది. విషయం తెలుసుకున్న ఆయన టీచర్లపై సీరియస్ అయ్యారు. అనంతరం ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విచారణ జరిపిన తరువాత నివేదిక తెప్పించుకొని పరిశీలించిన ఆయన టిక్ టాక్ వీడియోలు చేసిన ఆ తాత్కాలిక ఉపాధ్యాయినులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ సంఘటనలు మరవకముందే ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories