అవ్వ కష్టాలు తీర్చాడు.. కన్నీళ్లు తుడిచాడు..

అవ్వ కష్టాలు తీర్చాడు.. కన్నీళ్లు తుడిచాడు..
x
కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం
Highlights

ప్రభుత్వ కార్యాలయాలలో ఒక పని పూర్తి కావాలనుకుంటే ఏండ్ల తరబడి తిరగాల్సిందే. అయినప్పటికీ వారి సామాన్య ప్రజల సమస్యలు మాత్రం తీరవు.

ప్రభుత్వ కార్యాలయాలలో ఒక పని పూర్తి కావాలనుకుంటే ఏండ్ల తరబడి తిరగాల్సిందే. అయినప్పటికీ వారి సామాన్య ప్రజల సమస్యలు మాత్రం తీరవు. రైతులు, వృద్దులు, వికలాంగులు ఇలా ఒక్కరేంటి ఎవరైనా సరే, పెన్షన్, భూముల పట్టా, లోన్లు ఇలా ఏ విషయం గురించైనా సరే చెప్పులరిగేలా తిరగక తప్పదు. ఇలా ఎన్ని సార్లు తిరిగినా సరే అదికారులు వారి అస్సుల పట్టించుకోరు. కానీ ఓ కలెక్టర్ మాత్రం సామాన్యుల సమస్యలను తెలసుకొని వాటిని తీర్చడానికి తానే స్వయాన కదిలి వచ్చారు.

అధికారిలా కాకుండా సాధారణునిగా కలెక్టరేట్ మెట్లపై కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకన్నారు. పెన్షన్ కోసం వచ్చిన వృద్ధురాలితో ముచ్చటించారు. ఎన్నో రోజుల నుంచి పరిష్కారం కాని అవ్వ సమస్యని క్షనాల్లోనే తీర్చేసాడు. దాంతో ఆమె ఎంతో సంతోషించింది ఆమె కళ్లల్లో ఆనందాన్నిచూసి తానూ సంతోషపడ్డారు. పూర్తివిరాల్లోకెళితే అజ్మీర మంగమ్మ (70) అనే గిరిజన వృద్దురాలు జయశంకర్ భూపాలపల్లి మండలం గుర్రంపల్లి గ్రామంలో నివసిస్తుంది.

ఈమె గత రెండేళ్లుగా పెన్షన్ కోసం ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. ఎన్ని సార్లు తిరిగినా కూడా అధికారులు ఆమెని పట్టించుకోకుండా తిప్పుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం కూడా ఆ ముసలమ్మ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. దిక్కుతోచని పరిస్థితిలో మెట్లపై కూర్చొని ఉంది. అది గమనించిన కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ఆమె దగ్గరికి వెళ్లి కూర్చుని ఆమెతో సాధారణ వ్యక్తిలాగా మాటలు కలిపాడు. '' ఏమైంది పెద్దమ్మా.. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని ప్రశ్నించారు. దీంతో మంగమ్మ అతను కలెక్టర్ అని కూడా తెలియక పోవడంతో సామాన్యునితో మాట్లాడినట్లే ''రెండేండ్ల సంది పింఛన్ వస్త లేదు బిడ్డా. కలెక్టర్ సారును కలుద్దామని వచ్చిన.'' అని చెప్పింది.

అంతే కాదు తినడానికి తిండి కూడా లేదని, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నామని వాపోయింది. దీంతో స్పందించిన కలెక్టర్ ఆమె పక్కనే కూర్చొని, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుమతితో ఫోన్‌లో మాట్లాడారు. మంగమ్మకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. దీంతో ఆ ముసలమ్మ కలెక్టర్ కూ కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు ఈ దృశ్యాన్ని చూసిన వారంతా కలెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories