లంచం డబ్బులు వాపస్ ఇప్పించిన కలెక్టర్

లంచం డబ్బులు వాపస్ ఇప్పించిన కలెక్టర్
x
Highlights

తన భూమి పట్టాను తనకు ఇవ్వాలని తహసిల్దార్ కార్యాలయం చుట్టూ ఓ రైతు తిరుగుతుంటే దాన్నే అదనుగా చేసుకుని ఓ వీఆర్వో రైతు నుంచి లంచం తీసుకున్నాడు. కార్యాలయాల...

తన భూమి పట్టాను తనకు ఇవ్వాలని తహసిల్దార్ కార్యాలయం చుట్టూ ఓ రైతు తిరుగుతుంటే దాన్నే అదనుగా చేసుకుని ఓ వీఆర్వో రైతు నుంచి లంచం తీసుకున్నాడు. కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిన రైతు డబ్బులిస్తే అయినా తన పని త్వరగా అవుతుందని లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. రైతు దగ్గర నుంచి డబ్బు తీసుకున్న గ్రామాధికారులు తన పనిని పక్కన పెట్టేసారు. ఆ విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆ డబ్బులను తిరిగి రైతుకు ఇప్పించి అందరి దృష్టినీ ఆకర్షించారు. డబ్బును ఇవ్వడమే కాకుండా లంచం తీసుకున్న ఇద్దరు గ్రామాధికారులను కూడా సస్పెండ్ చేశారు.

ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. డబ్బులు ఇస్తేనే తన పనిని పూర్తి చేస్తామని గ్రామాధికారులు చెప్పడంతో రైతు ఆ వీఆర్వోకు రూ. 10 వేలు లంచం ఇచ్చాడు. రైతు నుంచి లంచం తీసుకున్న వీఆర్‌ఓ రమేష్ రెడ్డి తన పనిని చేయకుండా పక్కన పెట్టాడు. దీంతో విసిగి పోయిన రైతు కలెక్టర్ నిర్వహించే 'ప్రజావాణి' సదస్సులో తన గోడును వినిపించాడు. అతని బాధను విన్న కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ వెంటనే స్పందించి విచారణ జరిపించాడు.

వీఆర్వో రైతు నుంచి లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో వెంటనే ఆ వీఆర్‌ఓ, వీఆర్ఏలను మందలించారు. రైతు నుంచి తీసుకున్న డబ్బును రైతుకు వాపస్ ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాదు రైతులను ఇబ్బంది పెడుతున్న వీఆర్ఓ, వీఆర్‌ఏలను తక్షణమే సస్పెండ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కలెక్టర్‌పై అభినందనల వర్షం కురిపించారు. ఈ కలెక్టర్ ఇతర అధికారులకు కూడా ఆదర్శంగా నిలిచాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories