Top
logo

ఒకే ఇంట్లో 15 మోడళ్ల పాత కార్లు

ఒకే ఇంట్లో 15 మోడళ్ల పాత కార్లు
Highlights

కొత్త కార్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు చాలా మంది పాత కారును అమ్మేసి కొత్త కారును కొనుకుంటారు. ఇంకొంత మంది కారు రిపేరైతే దాన్ని బాగు చేసుకుని నడిపిస్తారు.

కొత్త కార్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు చాలా మంది పాత కారును అమ్మేసి కొత్త కారును కొనుకుంటారు. ఇంకొంత మంది కారు రిపేరైతే దాన్ని బాగు చేసుకుని నడిపిస్తారు. ఇంకొంత మంది కార్ పాడై పోయిందని దాన్ని స్క్రాప్ కు అమ్మేస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం తన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న కార్లను ఎంతో భద్రంగా చూసుకుంటున్నాడు. అంతే కాదు ఎవరైనా పాత కాలం నాటి కార్లను అమ్ముతున్నారని తెలిస్తే దాన్ని కొనుగోలు చేయడంలో అతను ముందుంటాడు.

పూర్తివివరాల్లో కెళితే నవాబ్‌ ముర్తుజా అలీ హుస్సేన్‌ అనే యువకుడికి పాత కాలం నాటి కార్లంటే ఎంతో ఇష్టం. వీరిది నవాబుల కుటుంబం. ఇతను బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-3 లోని అరోరా కాలనీలో నివసిస్తుంటాడు. ఇంటర్‌ వరకు చదివి ప్రస్తుతం కార్ల వ్యాపారం చేస్తున్నాడు. దీంతో ఇతని దగ్గర దాదాపుగా 15 పాతకాలం నాటి కార్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 1926 నాటి ఆస్టిన్, ఫోర్డ్‌ కార్లు, 1938లో తయారైన మోరిస్‌ టైగర్, 1945కు చెందిన మోరిస్, 1948కు చెందిన జాగ్వార్‌ కార్లు ఉన్నాయి.

ఇక పోతే ఈ యువకుడు తన తాత, తండ్రి వారసత్వంగా వచ్చిన పాత కార్లను భద్రంగా ఉంచారని. అతను కూడా అదే విధంగా కార్లను భద్రపురుస్తున్నారని తెలిపారు. ఇతని దగ్గర ఉన్న కార్లను చూడడానికి వివిధ దేశాల నుంచి వస్తుంటారని తెలిపారు. అంతే కాదు వింటేజ్‌ కార్ల ప్రదర్శనలో కూడా ఇతని దగ్గర ఉన్న కార్లను ప్రదర్శిస్తూ ఉంటారు.

Web TitleCollections of Fifteen Varients Old model Cars in Hyderabad
Next Story


లైవ్ టీవి