భారీగా పెరిగిన కొబ్బరి బోండాం ధరలు

భారీగా పెరిగిన కొబ్బరి బోండాం ధరలు
x
Highlights

రాష్ట్రం లో వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ కొబ్బరిబొండాలపై పడింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి భారీ ధరలు పలుకుతున్నాయి. ఒక్కొక్క కొబ్బరిబొండాం 40 నుంచి 50...

రాష్ట్రం లో వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ కొబ్బరిబొండాలపై పడింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి భారీ ధరలు పలుకుతున్నాయి. ఒక్కొక్క కొబ్బరిబొండాం 40 నుంచి 50 రూపాయలు పలుకుతుంది. ఇక జ్వరం వచ్చిన, గొంతు తడారినా నీరసంగా ఉన్న డాక్టర్లు సూచించే మొదటి స్థానం కొబ్బరి బొండాలకే దక్కుతుంది. ఇక తప్పని పరిస్థితుల్ల కొనాల్సి వస్తుందని వినియోగదారులు తెలుపుతున్నారు.

హైదరాబాద్ నగరంలో వైరల్ ఫీవర్స్, డెంగీ స్వైరవిహారం చేస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో వేలాది మంది దగ్గు ,జలుబు, జ్వరం తో మంచం పడుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యాతో సతమతమవుతున్నారు. సాధరణంగా జ్వరం తో బాధ పడుతున్నవారికి ఆకలి, రుచి తెలియకుండా పోతుంది. అలాగే శరీరంలో కాల్షియం , పోటాషియంతో పాటు లవణాల శాతం పడిపోతుంది. త్వరగా శక్తినిచ్చే కొబ్బరి బొండాలు రోజుకు రెండు నుండి మూడు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో జ్వరాలతో బాధ పడేవారు ఆహారం కంటే కొబ్బరిబొండాల పైనే ఆధార పడుతున్నారు. దీంతో గతంలో 15-25 రూపాయలు పలికిన కొబ్బరిబొండాలు ఇప్పుడు ఏకంగా 40-50 రూపాయలు పలుకుతున్నాయి.

కొబ్బరిబొండాలు వేసవికాలం కన్నా తక్కువగా ధర ఉండాలి. కానీ ఇంత ఎక్కువ ధరలు ఉండడంపై వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారులు మాత్రం ప్రతి సంవత్సరం లాగే ఈసారి ఉభయ గోదావరి జిల్లాల నుండి రావాల్సిన సరుకు రాకపోవడం వల్లే కొబ్బరిబోండాల ధరలు పెరిగాయంటున్నారు. కేవలం కేరళ నుండి వస్తున్న కొబ్బరిబొండాలను మాత్రమే అమ్ముతున్నామని అది మాకే 50 రూపాయలు పడడం వల్ల ఎక్కువ ధర పెట్టి కొనడానికి ఎవరు ముందుకు వస్తలేరంటున్నారు.

నగర వ్యాప్తంగా ఉన్న కొబ్బరిబోండాల వ్యాపారులంతా కలిసి రోజుకు 2లక్షల పైన బొండాలు విక్రయిస్తున్నట్లు తెలిసింది. నగరం లో విజృంబిస్తున్న వ్యాధులను ఆసరాగా చేసుకొని ఉభయగోదావరి జిల్లాల నుండి భారీగా కొబ్బరిబొండాలు దిగుమతి చేసుకొని కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. గోడౌన్ ల పై అధికారులు దాడులు చేసి కృత్రిమ కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories