డిసెంబర్ 1న ఆర్టీసీ కార్మికులతో సీఎం సమావేశం

డిసెంబర్ 1న ఆర్టీసీ కార్మికులతో సీఎం సమావేశం
x
File Photo
Highlights

ఆర్టీసీ కార్మికలు వారి డిమాండ్ల సాధనకోసం 52 రోజులు చేసిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు.

ఆర్టీసీ కార్మికలు వారి డిమాండ్ల సాధనకోసం 52 రోజులు చేసిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు. సమ్మె సమయంలో ప్రభుత్వం కార్మికులకు రెండు సార్లు విధుల్లోకి చేరమని తెలిపినప్పటికీ వారు చేరకుండా సమ్మెని కొనసాగించారు. ఇంతకీ ప్రభుత్వం దిగిరాక పోవడంతో కార్మికులే వారంతట వారు సమ్మెను విరమించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మూడు రోజుల వరకూ కార్మికులను విధుల్లోకి తీసుకోలేదు ఆర్టీసీ యాజమాన్యం.

దీంతో కార్మికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ ఉద్యోగాలు ఎక్కడపోతాయో అనుకుని భయపడ్డారు. కానీ కార్మికుల కష్టాలను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారికి ఎలాంటి షరతులు పెట్టకుండా వారిని విధుల్లోకి తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికలోకమంతా ఒక్క సారిగా సంబరాల్లో మునిగిపోయింది.

ఈ సందర్భంగానే ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేయాలనే ఆలోచనతో ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని 97 డిపోలకు చెందిన కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వనిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రతి డిపోనుండి ఐదుగురు కార్మికులను పిలుస్తున్నారు. ఈ ఐదుగురిలో ఇద్దరు మహిళలు ఖచ్చితంగా ఉండాలని చెబుతున్నారు. ఈ సమావేశాన్ని డిసెంబర్ 1 వ తేదీన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం ఏర్పాటు చేయనున్నారు. అంతే కాక ఈ సమావేశానికి హాజరయ్యే కార్మికులకు రావాణా సౌకర్యంతో పాటు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన సౌకర్యాలను ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చేసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, యూనియన్ల అంశం, ఆర్టీసీకి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన విషయాలను సీఎం కేసీఆర్ కూలంకషంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్‌తో పాటు, ఆర్టీసీ ఎండీ, ఇ.డీ.లు, ఆర్.ఎం.లు, డివిఎంలు కూడా హాజరు కానున్నారుని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories