logo

రేపు దుబాయ్‌ వెళ్లనున్న సీఎం కేసీఆర్‌

రేపు దుబాయ్‌ వెళ్లనున్న సీఎం కేసీఆర్‌
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటినుంచి వారం రోజులపాటు గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు. అందుకోసం రేపు దుబాయ్‌...

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటినుంచి వారం రోజులపాటు గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు. అందుకోసం రేపు దుబాయ్‌ చేరుకోనున్నారు. ఆ యూఏఈల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రోటోకాల్‌ విభాగం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన సాగనుంది. తెలంగాణ సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.

ముఖ్యమంత్రి తోపాటుగా సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ఐఏఎ్‌సలు అర్వింద్‌కుమార్‌, జయేష్‌ రంజన్‌ తదితరులు వెళ్లనున్నారు. 2014లో తొలిసారిగా సీఎం హోదాలో సింగపూర్‌ వెళ్లిన కేసీఆర్ అక్కడ ఐఐఎం అలుమ్ని అసోసియేషన్‌ సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత చైనా, హాంకాంగ్‌ల్లోనూ పర్యటించి తెలంగాణాలో పెట్టుబడులను ఆకర్షించారు.


లైవ్ టీవి


Share it
Top