ఈనెల 7న లేదా 8వ తేదీన మంత్రి వ‌ర్గ విస్తర‌ణ?

ఈనెల 7న లేదా 8వ తేదీన మంత్రి వ‌ర్గ విస్తర‌ణ?
x
Highlights

గతేడాది డిసెంబ‌ర్ 13న సీఎం కేసిఆర్ తోపాటు హోమ్ మంత్రిగా మ‌హ్మూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. మంచిరోజులు లేకపోవడంతో సంక్రాంతి త‌ర్వాత తెలంగాణ...

గతేడాది డిసెంబ‌ర్ 13న సీఎం కేసిఆర్ తోపాటు హోమ్ మంత్రిగా మ‌హ్మూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. మంచిరోజులు లేకపోవడంతో సంక్రాంతి త‌ర్వాత తెలంగాణ మంత్రివ‌ర్గ విస్తర‌ణ ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ కేసిఆర్ చేపట్టిన యాగం కారణంగా క్యాబినెట్ విస్తరణ ఆల‌స్యమైంది. ఇక రేపటినుంచి మాఘ‌మాసం మొద‌లు కావ‌డంతో కేసీఆర్ మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌కు సిద్దమైన‌ట్టు వార్తలు వస్తున్నాయి. ఈనెల 7న లేదా 8వ తేదీన మంత్రి వ‌ర్గ విస్తర‌ణ ఉంటుంద‌ని టిఆర్‌ఎస్‌లో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది.

ఈ నెల 18 కేంద్ర ఆర్థిక సంఘం బృందం హైద‌రాబాద్ పర్యట‌న‌, ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స‌మావేశాలు జ‌రుగ‌నుండ‌టంతో ఈలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆరెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా తొలివిడతలో 8 నుంచి 10మందికి మాత్రమే చోటు ఉంటుంద‌ని సమాచారం. దీంతో మొదటి విడతలోనే మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు ఆశావాహులు. పాత మంత్రుల్లో కేటిఆర్, హ‌రీష్ రావ్ ల‌తో పాటు మ‌రో ఇద్దరికీ చోటు ద‌క్కనున్నట్టు టీఆరెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories