రేపు యాదాద్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్...

రేపు యాదాద్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్...
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు యాదాద్రి భవనగిరి వెళ్లనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, యాదాద్రి పనుల పురోగతిపై సమీక్షించి సీఎం దిశానిర్దేశం...

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు యాదాద్రి భవనగిరి వెళ్లనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, యాదాద్రి పనుల పురోగతిపై సమీక్షించి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగంపై సీఎం చర్చించనున్నారు. యాగం నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

యాదాద్రిలో త్వరలో మహా సుదర్శన యాగం నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం యాదాద్రికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి తో చర్చించిన సీఎం.. వంద ఎకరాల యజ్ఞ వాటికలో 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగం నిర్వహించాలని నిర్ణయించారు. 3వేల మంది రుత్విక్కులు, మరో 3వేల మంది సహాయకులతో మహా యాగాన్ని గొప్పగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

కేవలం భారతదేశంలోనివి మాత్రమే కాకుండా బద్రీనాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి వంటి మహాక్షేత్రాల నుంచి మతాధిపతులను, కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులను, అన్ని సంప్రదాయాలకు చెందిన మత గురువులను ఈ యాగానికి ఆహ్వానించనున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి విస్తృతమైన ఏర్పాట్లు చేసే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories