ప్రగతిభవన్ లో అదనపు జాగ్రత్తలు

ప్రగతిభవన్ లో అదనపు జాగ్రత్తలు
x
Highlights

తెలంగాణలో వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బంది మరింత అలర్ట్ అయింది. అధికారులను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తరువాతే ప్రగతి...

తెలంగాణలో వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బంది మరింత అలర్ట్ అయింది. అధికారులను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తరువాతే ప్రగతి భవన్ లోకి అనుమతిస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ సైతం జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులతో మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

కరోనా మహామ్మారి అధికార పార్టీ నేతలను హడలెత్తిస్తోంది. వైరస్ ఎవరి నుంచి ఏ రూపంలో అంటుకుంటుందోనని హడిలిపోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తాలకు కరోనా సోకడంతో అధికార పార్టీ నేతల్లో అందోళన మెదలైంది. మంత్రి హరీష్ రావు సైతం హోం క్యారంటైన్ లోకి వెళ్లగా కేటీఆర్ వరంగల్ పర్యటన కూడా వాయిదా పడింది.

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, మంత్రులతో జరిగిన సమావేశంలో ఖచ్చితమైన నిబంధనలతో ప్రగతి భవన్ లోకి అనుమతించారు. సుమారు 200 మందికిపైగా హాజరైన ఈ సమావేశంలో కోవిడ్ నిబంధనలతో పాటు అదనపు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అధికారుల కార్లను రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గరే పార్కు చేశారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లోనే కలెక్టర్లు ప్రగతి భవన్‌ కు చేరుకున్నారు. అధికారులు ప్రగతి భవన్‌కు చేరుకోగానే థర్మల్ స్కాన్ చేశారు. వరుస క్రమంలో వారిని చెక్ చేసిన తరువతే లోపలికి అనుమతించారు. అధికారుల టెంపరేచర్ ను రికార్డు చేయ్యడంతోపాటు వారికి శానిటైజర్లను అందించింది ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బంది.

ఇక జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కోరాన వైరస్ తీవ్రంగా ఉన్నానేపథ్యంలో కేసీఆర్ తన ముఖానికి కండువా చుట్టుకున్నారు ఫిజికల్ డిస్టన్స్ ను కూడా పూర్తి స్థాయిలో పాటించారు. తాను కూర్చున్న సీట్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీటర్నర దూరం ఉండే విధంగా సీట్లను అరెంజ్ మెంట్ చేశారు. మంత్రులు కూర్చునే సీట్లు కూడా ఆ మేరకు దూరంగా ఉండే విధంగా అరెంజ్ చేశారు. ప్రతి అధికారి మాస్కు లు పెట్టుకోవాలని సూచించడంతో అందరూ మాస్కులు ధరించి సమీక్షలో పాల్గొన్నారు.

మొత్తంగా కరోనా ఇప్పుడు ప్రజా ప్రతినిథులను, అధికార యంత్రాంగాన్ని కూడా వెంటాడుతుండటంతో ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బంది మరింత అలర్ట్ అయింది. సీఎం కేసీఆర్ తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే మంత్రులతో, అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories