రేపట్నుంచి కేసీఆర్ ప్రాజెక్టుల బాట

రేపట్నుంచి కేసీఆర్ ప్రాజెక్టుల బాట
x
Highlights

సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల బాట పట్టారు. రేపు ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు, పెండింగ్‌లో ఉన్న...

సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల బాట పట్టారు. రేపు ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు, పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష జరుపనున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడంతో ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై దృష్టి సారించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్, పంప్‌హౌస్ ను పరిశీలించనున్నారు.

ఇక వట్టెం, కర్వెన, ఏదుల, నార్లాపూర్ పనులు 60 శాతం పూర్తైనట్టు అధికారులు చెప్తున్నారు. ముందుగా రోజుకు టీఎంసీ నీళ్ల ఎత్తిపోసే పనులు పూర్తిచేసి, వరదల కాలంలో రోజుకు అదనంగా మరో టీఎంసీ ఎత్తిపోసుకుని, 100 రోజుల్లో 100 టీఎంసీలు ఎత్తిపోసి పదిలక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. పాలమూరు ద్వారా అప్పన్నపల్లి, భూత్పూరు సమీపంలో రెండు పెద్దకాల్వలు వస్తున్నాయని. ఇవి పాలమూరు పట్టణానికి కొత్త అందాన్ని తీసుకువస్తాయని అధికారులు తెలిపారు. చెరువులు నింపి జిల్లాను సస్యశ్యామలం చేసుకోవాలిని ప్రభుత్వం భావిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories