Top
logo

నేడు సీఎం కేసీఆర్ గజ్వేల్ పర్యటన

నేడు సీఎం కేసీఆర్ గజ్వేల్ పర్యటనసీఎం కేసీఆర్
Highlights

సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బుధవారం పర్యటించనున్నారు.

సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బుధవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సీఎం పర్యటన, ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్‌ గజ్వేల్‌లో పట్టణంలో నిర్మించిన వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌, ఎడ్యూకేషన్‌ హబ్‌, సమీకృత భవన సముదాయాన్ని, మహంతి ఆడిటోరియంను, హెర్బల్‌ పార్కు, అర్బన్‌ పార్కు, పాండవుల చెరువు, రేడియల్‌ రోడు, 100 పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తారని తెలిపారు.

అనంతరం ములుగు మండలంలోని కొండాలక్ష్మణ్‌ బాపూజీ అగ్రికల్చర్‌ యూనివర్సిటీని ప్రారంభించి, మాతాశిశు ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలన్ని ముగిసిన తరువాత నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించనున్నారని తెలిపారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించే విందు కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం వరకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారని తెలిపారు.

Web TitleCM KCR to Visit Gajwel
Next Story

లైవ్ టీవి


Share it