పది పరీక్షలపై సమీక్షించనున్న సీఎం కేసీఆర్‌.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..

పది పరీక్షలపై సమీక్షించనున్న సీఎం కేసీఆర్‌.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..
x
Highlights

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు విద్యార్థులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోసారి పరీక్షలు వాయిదాపడడంపై తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరీక్షలు...

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు విద్యార్థులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోసారి పరీక్షలు వాయిదాపడడంపై తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరీక్షలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో సీఎం కేసీఆర్ నేడు విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారా లేదా గ్రేడింగ్ సిస్టం ద్వారా పై తరగతులకు ప్రమోట్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. గత మార్చి లో మూడు పరీక్షలు జరిగిన తర్వాత లాక్ డౌన్ తో వాయిదా పడ్డాయి. లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో జూన్ 8 నుంచి గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఆ విధంగా పరీక్షలను నిర్వహించడం కుదరదని భావించిన విద్యాశాఖ పరీక్షలను వాయిదావేసింది.

మరోసారి పరీక్షలు వాయిదాపడడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. విద్యార్థులు మనోధైర్యం కోల్పోయి పరీక్షలు రాసే స్థితిలో లేరని తెలంగాణ బాలల హక్కుల సంక్షేమ సంఘం వాదిస్తోంది. పరీక్షలు రద్దు చేసి, గతంలో రాసిన పరీక్షల ప్రాతిపదికన గ్రేడింగ్ సిస్టం ద్వారా పై తరగతులకు పంపించాలని డిమాండ్ చేస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. గ్రేడింగ్ సిస్టం ద్వారా తమని ప్రమోట్ చేయాలని కోరుతున్నారు.

పదో తరగతి పరీక్షలపై ఏం చేయాలనే అనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. నేడు విద్యాశాఖ ఉన్నతాధికారులతో మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశంకానున్న సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories