logo

తెలంగాణలో మరో కొత్త చట్టం రాబోతోంది..!

తెలంగాణలో మరో కొత్త చట్టం రాబోతోంది..!
Highlights

రెవెన్యూశాఖ ప్రక్షాళనపై కేసీఆర్ ఫోకస్‌ కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై కసరత్తు ప్రగతిభవన్‌‌లో కలెక్టర్లతో సమావేశానికి సిద్ధం ప్రజలు, రైతులకు ఇబ్బంది కలుగకుండా కొత్త చట్టం

కొత్త రెవెన్యూ చట్టం పై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. ఇందుకోసం మేధోమథనం నిర్వహించబోతున్నారు. కొత్త చట్టం ఏ విధంగా ఉండాలి, ప్రస్తుతం రెవెన్యూ చట్టంలో ఉన్న అంశాలపై జిల్లా కలెక్టర్లతో ,మంత్రులతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇందుకుగాను మంగళవారం ఉదయం 11:30 కు ప్రగతి భవన్ లో సమావేశం ఏర్పాటు చేసారు సీఎం.

కొత్త చట్టాలు, సంచలన నిర్ణయాలతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఇప్పుడు రెవెన్యూశాఖ ప్రక్షాళనపై దృష్టిపెట్టారు. అవినీతికి ఆస్కారంలేని కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని భావిస్తోన్న కేసీఆర్‌‌ భూపరిపాలనతో ప్రత్యక్ష సంబంధముండే ఉన్నతాధికారుల అభిప్రాయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా కలెక్టర్లతో సమావేశమవుతోన్న సీఎం కేసీఆర్‌ ప్రజలు, రైతులకు ఇబ్బంది కలుగకుండా కొత్త చట్టం రూపకల్పనపై చర్చించనున్నారు. అలాగే కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమలుపై కూడా అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఇక పల్లెలు, పట్టణాల్లో అమలు చేయబోయే 60రోజుల ప్రత్యేక కార్యాచరణపైనా చర్చించనున్నారు.

ఇదిలాఉంటే, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి తీసుకొచ్చాక, గ్రామ పరిపాలపై దృష్టిసారించిన కేసీఆర్ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, హరితహారంలాంటి కార్యక్రమాల విజయవంతం కోసం మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రతి గ్రామానికో ట్రాక్టర్ అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top