ఆర్టీసీ సమ్మెపై నేడు సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసీఆర్

కేసీఆర్
x
కేసీఆర్
Highlights

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నిరవధికంగా 46 రోజులు సమ్మెను కొనసాగించారు. కానీ ఇప్పుడు ఆ సమ్మెను వారంతట వారే విరమించి విధుల్లోకి చేరలాని...

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నిరవధికంగా 46 రోజులు సమ్మెను కొనసాగించారు. కానీ ఇప్పుడు ఆ సమ్మెను వారంతట వారే విరమించి విధుల్లోకి చేరలాని నిర్ణయానికొచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి ఈ సమ్మెను చట్ట విరుధ్దంగానే చూస్తోంది. దీంతో ప్రభుత్వం తమపై ఎలాంటి షరతులు విధించ కుండా విధుల్లోకి తీసుకుంటే వారు విధుల్లోకి చేరతామని బుధవారం జేఏసీ నాయకలు తెలిపారు. అయితే గతంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు రెండుసార్లు గడువును విధించింది. అప్పడు కార్మికులు ప్రభుత్వం మాట వినకుండా సమ్మె విరమించేది లేదంటూ వెనక్కి తగ్గకుండా సమ్మెను కొనసాగించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కార్మికులు వారంతట వారే సమ్మె విరమించి విధుల్లోకి చేరాలనే నిర్ణయానికొచ్చింది.

ఈ నేపధ్యంలోనే ఆర్టీసీ కార్మికులు వ్యవహారం పై సీఎం కేసీఆర్ గురువారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏయే అంశాలు ఉన్నాయన్న విషయాలపై సమీక్షించన్నారు. ప్రభుత్వం రెండు సార్లు విధుల్లోకి చేరాలని ప్రకటించినప్పటికీ సమ్మె విరమించని కార్మికులు, ఇప్పుడు వారంతట వారే స్వతహాగా విధుల్లోకి చేరతామనడంతో ఈ విషయాలపై కీలకమైన చర్చ సాగించనున్నారు సీఎం కేసీఆర్. అసలు ఈ చర్చ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో అన్న విషయంపై కార్మిక వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. చర్చ అనంతరం ఆర్టీసీ బస్సులు రోడెక్కేనా లేదా, ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా లేదా వేచి చూడాల్సిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories