మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్న కేసీఆర్

మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్న కేసీఆర్
x
Highlights

మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ .. హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఈ రోజు (ఫిబ్రవరి 27) ఓ ప్రైవేటు కార్యక్రమానికి...

మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ .. హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఈ రోజు (ఫిబ్రవరి 27) ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తున్న కేసీఆర్ కి రోడ్డుపై దరఖాస్తుతో పట్టుకొని నిల్చొని ఉన్న ఓ వృద్ధుడిని గమనించి కాన్వాయ్ ఆపి అతని కష్టాన్ని తెలుసుకున్నారు. తన పేరును మొహమ్మద్ సలీమ్‌ గా పరిచయం చేసుకున్న ఆ వృద్దుడు గతంలో తానూ డ్రైవర్ గా పనిచేసేవాడినని, ప్రస్తుతం ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడుతున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కుమారుడి ఆరోగ్యం కూడా ఎం బాలేదని, ఉండడానికి ఇల్లు కూడా లేదని తన ఆవేదనని వ్యక్తం చేశాడు. ఈ మేరకు తనకి సహాయం చేయాలనీ కోరాడు.

దీనిపైన వెంటనే స్పందించిన సీఎం, సలీమ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వికలాంగుల పింఛన్ తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా వెంటనే మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ శ్వేతా మహంతి టోలి చౌకిలో సలీమ్ నివాసం ఉంటున్న సలీమ్ ఇంటికి వెళ్లి విచారణ జరిపి అతనికి అప్పటికప్పుడు పింఛన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు.


అంతేకాకుండా అతనికి అతని కుమారుడికి ప్రభుత్వ ఖర్చులతో వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ చేసిన సహాయానికి సలీమ్ ఆనందంతో ఆయన సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. వృద్ధుడి సమస్యను సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి తీర్చడంతో సీఎం కేసీఆర్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories