పోతిరెడ్డి పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్

పోతిరెడ్డి పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్
x
Highlights

కృష్ణ జలాల అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హీట్ రాజేసింది. తాజాగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో...

కృష్ణ జలాల అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హీట్ రాజేసింది. తాజాగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 203ను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హైదరాబాద్ లో గాంధీ భవన్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఏపీ సర్కార్ అక్రమ నీటి తరలింపును అడ్డుకొని తీరుతామన్నారు పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

పోతిరెడ్డిపాడు పనులు మొదలైతే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఎడారే అవుతుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 2 టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించి కుట్ర చేశారని ఆరోపించారు. మేము పోరాటం మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ రెండు టీఎంసీల కొనసాగుతుందని అన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ను, గవర్నర్ ను, అవసరమైతే ప్రధానిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

గ్రావిటీ నీటికి ఎంత ఇంపార్టెంట్ ఉందో అర్థమవుతుంది. ఆరు వేల కోట్లతో జగన్మోహన్ రెడ్డి నాలుగు టీఎంసీల నీటిని తరలించడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. కాలేశ్వరం నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించడానికి కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాడు. కమీషన్ల కోసమే అంచనాలు పెంచి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories