భూములు కోల్పోయినవారి త్యాగాలు వెలకట్టలేనివి : సీఎం కేసీఆర్

భూములు కోల్పోయినవారి త్యాగాలు వెలకట్టలేనివి : సీఎం కేసీఆర్
x
CM KCR(File photo)
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు అతి పెద్దదని సీఎం కేసీఆర్ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు అతి పెద్దదని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ చినజీయర్‌ స్వామిజీతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని మర్కూక్-పాములపర్తి గ్రామాల సమీపంలోని కొండపోచమ్మ జలాశయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలోనూ నిర్మించలేదని అన్నారు. కొండపోచమ్మసాగర్ జలాశయం ప్రారంభం తెలంగాణ చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమని ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ రైతాంగం రూ.లక్ష కోట్ల విలువైన పంటను ఏడాదికి పండించబోతుందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఒకప్పుడు ఏడుపు పంటల తెలంగాణగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు పసిడి పంటల తెలంగాణగా మారిందని ఆయన అన్నారు. దేశంలో 83 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే అందులో 53 లక్షలు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఇచ్చిందని ఈ విషయాన్ని స్వయంగా ఎఫ్‌సీఐ ప్రకటించిందన్నారు. 165 టీఎంసీల సామర్థ్యంతో రాష్ట్రంలో కొత్తగా రిజర్వాయర్‌లు నిర్మించామన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో రెండో అతిపెద్దదని ఆయన స్పష్టం చేసారు. కేవలం మూడు నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేయగలిగాం అని గర్వంగా చెప్పారు.

ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో మంది భూములను కోల్పోయారని వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చినవారికి తలవంచి నమస్కారం చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వారి కుటుంబాలకు సిద్దిపేట ఎస్‌ఈజడ్‌లో ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నిర్వాసితుల కోసం కొత్త గజ్వేల్ నగరం నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టుల నిర్వాసితుల కోసం ఇప్పటికే మంచి పరిహారం ఇచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు. అయినా వారికి ఇల్లు లేదనే బాధ మాత్రం అంతే ఉందని అన్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories