దేశ ప్రధాని పైనే సెటైర్లా.. వారిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశం : సీఎం కేసీఆర్

దేశ ప్రధాని పైనే సెటైర్లా.. వారిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశం : సీఎం కేసీఆర్
x
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కొంత మంది సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్స్‌పై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కరోనా కట్టడికి 'జనతా కర్ఫ్యూ' పేరుతో...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కొంత మంది సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్స్‌పై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కరోనా కట్టడికి 'జనతా కర్ఫ్యూ' పేరుతో పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీకి ప్రెస్‌మీట్‌లోనే ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల తరువాత ప్రజలందరూ తాము ఉన్న చోట చప్పట్లు కొడుతూ మన కోసం పని చేస్తున్న వారికి సంఘీభావం తెలపాలని ప్రధాని మోదీ కోరారు.

అయితే దీన్ని సోషల్ మీడియాలో కొందరు అపహాస్యం చేయడాన్ని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఓ సమస్యపై పోరాటం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను చేపడితే కొందరు ఇలాంటి చర్యలకు దిగడం మంచిదికాదని కేసీఆర్ అన్నారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని ప్రధాని స్థాయి వ్యక్తిని ఈరకంగా కించపరచడం ఏంటని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని అక్కడే ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నేను కూడా రేపు సాయంత్రం 5 గంటలకు ఇంటి బయటికి వచ్చి నా కుటుంబంతో సహా చప్పట్లు కొడతాను అని కేసీఆర్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories