logo

ఆ లెక్క ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చారు: సీఎం కేసీఆర్

ఆ లెక్క ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చారు: సీఎం కేసీఆర్
Highlights

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి...

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ పురపాలక చట్టం - 2019 బిల్లును సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై రేపు చర్చ జరగనుంది. అయితే నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడంపై మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ అధ్యక్షా.. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బిల్లుకు సంబంధించి ఉద్దేశాలు.. టీచింగ్ స్టాఫ్ లో సూపర్ స్పెషలైజేషన్ సంబంధించి.. స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల చాలా సీట్లు మనం కొల్పోతున్నాం కాబట్టి వల్ల గురించి ఆలోచన చేసి పదవి విరమణ వయసుని 58 నుండి 65 సంవత్సరాలు పెంచడానికి ప్రవేశపెట్టిన బిల్లుకి పాస్ చేయడానికి మా పార్టీ తరుపున ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

అలాగే అతి ముఖ్యమైన అంశం మీద్వారా ఈ సభకు, రాష్ట్రానికి తీసుకరాదాలుచుకున్న అధ్యక్షా.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12మంది శాసనసభ్యులను అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నట్లు మెర్జర్ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ భట్టి విక్రమార్క ఆక్రోశాన్ని చెబుతాఉన్నారు.. ఇబ్బంది ఏం లేదు అధ్యక్షా.. రాజ్యంగంలో కొన్ని నిబంధనల ఉన్నాయి.. ఆ నిబంధనలకు సంబంధించే వ్యవహారం జరుగుతుందని అన్నారు. వారు ఎదైతే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు టీఆర్ఎస్ వీలినం అయినారో దానికి వారు మాట్లాడుతున్నారు.. దానికి వారికి వారే సమాధానం చెప్పుకోవాలని అన్నారు. రాజ్యాంగం నిబంధనలకులోబడి కానిస్టుష్యన్ ఆఫ్ ఇండియా అర్టికల్ షెడ్యుల్ 10 ప్రకారమే వారు టీఆర్ఎస్ పార్టీలో చేరారు అని కేసీఆర్ అన్నారు. ఇది ప్రజలకు కూడా తెలియాలి అని అన్నారు. వాస్తవానికి తాము అధికారంలో వచ్చాకా కొంతమంది మా పార్టీలో చేరుతాం అని అన్నారు కానీ దానికి మేము వద్దు అని చెప్పాము.. మేమే 88మంది గెలుపొందాం ఒక ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు అని అన్నారు.


లైవ్ టీవి


Share it
Top