కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ప్రారంభం

కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ప్రారంభం
x
KCR (file photo)
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. వ్యవసాయం, ఉపాధి హామీ పనులు సహా ఇతర అంశాలపై వారితో చర్చించనున్నారు. కరోనా కట్టడి...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. వ్యవసాయం, ఉపాధి హామీ పనులు సహా ఇతర అంశాలపై వారితో చర్చించనున్నారు. కరోనా కట్టడి ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది.

ఉపాధి హామీ నిధులతో వీలైనన్ని ఎక్కువశాఖల్లో పనులు చేపట్టేలా ప్రణాళికలుసిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్లతో లక్ష కల్లాలు నిర్మించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమావేశానికి మంత్రులు కలెక్టర్లతోపాటు అడిషనల్ కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా అటవీ అధికారులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories