ఆర్టీసీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

ఆర్టీసీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
x
కేసీఆర్
Highlights

ఆర్టీసీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

ఆర్టీసీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో ఇవాళ తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు సీఎం కేసీఆర్.

ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 48 రోజులుగా సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటనతో పాటు హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏఏ అంశాలు ఉన్నాయనే అంశంపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఐదు గంటల పాటు సుధీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఆర్థిక భారం భరించే శక్తి ప్రభుత్వానికి లేదన్నారు. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు తర్వాత తుది నిర్ణయం తీసునున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు ఇతర అంశాలపై కూలంకుశంగా అధ్యనం చేయాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్. ఆర్టీసీకి ఇప్పటికే 5 వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రెండు వేల కోట్ల వరకు ఉన్నాయని సెప్టెంబర్‌ నెల వేతనాల చెల్లింపునకు 240 కోట్ల రూపాయలు అవసరమని సీఎం కేసీఆర్ చెప్పారు. సీసీఎస్‌కు 500 కోట్లు రూపాయలు ఇవ్వాలని పీఎఫ్‌ బకాయిల కింద నెలకు రూ. 65 నుంచి 75 కోట్ల రూపాయలు అవసరం ఉందన్నారు. ఈ భారమంతా ఎవరు భరిస్తారని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నదని 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్. మొత్తంగా ఆర్టీసీని ఇప్పడున్నుట్లు నడిపించాలంటే నెలకు 640 కోట్ల రూపాయలు కావాలని ఇంతటి భారం భరించే శక్తి ఆర్టీసీకి లేదని పైగా ఆర్ధిక మాంధ్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదన్నారు సీఎం కేసీఆర్. ఎంతోకొంత ప్రభుత్వం సహాయం చేసినా అది ఎంతవరకు కొనసాగించగలుగుతుంది..?ఛార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories