విద్యుత్ శాఖకు సీఎం కేసీఆర్ అభినందనలు

విద్యుత్ శాఖకు సీఎం కేసీఆర్ అభినందనలు
x
Highlights

రాష్ట్రమంతా లైట్లు ఆర్పేసినా గ్రిడ్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించిన విద్యుత్ శాఖను అభినందించారు సీఎం కేసీఆర్. అంచనాకు మించి...

రాష్ట్రమంతా లైట్లు ఆర్పేసినా గ్రిడ్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించిన విద్యుత్ శాఖను అభినందించారు సీఎం కేసీఆర్. అంచనాకు మించి డిమాండ్ పడిపోయినా వ్యూహాత్మకంగా బ్యాలెన్స్ చేయగలిగారని సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోడీ పిలుపునిచ్చిన మేరకు రాష్ట్రంలో రాత్రి 9 గంటలకు ప్రజలంతా దీపాలు వెలిగించారు. అదే సమయంలో ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆర్పేశారు. దీంతో ఒక్కసారిగా విద్యుత్‌ వినియోగంలో భారీ మార్పులు వచ్చాయి. రాత్రి 9 గంటల వరకు 7 వేల 3 వందల మెగావాట్లున్న విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కసారిగా లైట్లు ఆర్పివేయడంతో 5 వేల 8 వందల మెగావాట్లకు పడిపోయింది.

రాష్ట్ర ట్రాన్స్ కో 6 వందల మెగావాట్ల డిమాండ్ తగ్గిపోతుందని అంచనా వేయగా ఊహించని విధంగా 15 వందల మెగావాట్ల డిమాండ్ తగ్గింది. అయినా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ లను బ్యాలెన్స్ చేయటంలో జెన్‌కో, ట్రాన్స్‌కో విజయం సాధించాయి. తగ్గిన 1,500 మెగావాట్ల డిమాండ్‌ను మెయిన్‌టెయిన్‌ చేసేందుకు నాగార్జునసాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్ల వద్ద రివర్స్‌ పంపింగ్‌ నిర్వహించారు.అటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలో 120 మెగావాట్ల సామర్థ్యంతో పంపింగ్‌ కొనసాగించారు. రాష్ట్ర ప్రజలంతా మళ్లీ విద్యుత్‌ దీపాలను వెలిగించగానే రివర్స్‌ పంపింగ్‌ను నిలిపివేశారు.

ఈ ప్రక్రియనంతా ఉదయం నుంచి స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ లో ఉన్న విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇక దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించే ముందు లక్షా 17 వేల 3 వందల మెగావాట్లు ఉన్న విద్యుత్‌ డిమాండ్‌ రాత్రి 9 గంటల తర్వాత 85 వేల 3 వందల మెగావాట్లకు పడిపోయింది. అయితే ఇంజినీర్లు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓల్టేజ్ లో హెచ్చు తగ్గులు లేకుండా సమన్వయంతో పనిచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories