NTR, ఇందిరాగాంధీ లాంటివాళ్ళే ఓడిపోయారు : కేసీఆర్

NTR, ఇందిరాగాంధీ లాంటివాళ్ళే ఓడిపోయారు : కేసీఆర్
x
KCR
Highlights

రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజమేనని అన్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ లాంటి నాయకులే సామాన్యుల చేతిలో ఓడిపోయారన్న

రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజమేనని అన్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ లాంటి నాయకులే సామాన్యుల చేతిలో ఓడిపోయారన్న విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు పాలిస్తారని కేసీఆర్ వాఖ్యానించారు. రెండు రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నేతలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని కేసీఆర్ వాఖ్యానించారు. నోరు ఉంది కాదా అని గొంతు చించుకోవద్దని, రాజకీయాల్లో సహనం అవసరమని అన్నారు.

రోజురోజుకి కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతుందని అన్నారు. నాలుగు దశాబ్దాలకి పైగా పాలించిన కాంగ్రెస్ తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో నాలుగు శాతం ఓట్లను కూడా సంపాదించుకోలేదని ఎద్దావా చేశారు. ప్రజలు ఓడించినా కాంగ్రెస్‌కు బుద్ధిరాలేదని కేసీఆర్ మండిపడ్డారు.. ఇక తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కాంగ్రెస్‌ చాల ప్రయత్నాలు చేసిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలను ఏకం చేసి, కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు.

ఇక ఏ ఎన్నికల్లో అయిన సరే ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉంటున్నారని, వరుసగా ఎందుకు ఓడిపోతున్నారో కాంగ్రెస్ నాయకులూ ఆత్మపరిశీలన చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ కి అలవాటేపోయిందని అన్నారు. ఇక ప్రభుత్వం పై కేసుల మీద కేసులు వేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతూ మళ్ళీ నీళ్లు రావడం లేదని అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు.

కరోనా వైరస్ లేదు:

ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ రాదని, వచ్చిన వచ్చిన అడ్డుకుంటామని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. చైనాలో పుట్టిన ఈ జబ్బు 130 కోట్ల మంది భారతీయుల్లో కేవలం 31 మందికి కరోనా వచ్చిందని అన్నారు. ఆ 31 మంది కూడా దుబాయ్‌, ఇటలీ లాంటి ఇతర దేశాలకు పోయి వచ్చినా వారేనని అన్నారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్‌ బతకదని, ప్రస్తుతం రాష్ట్రంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని, అలాంటప్పుడు ఆ వైరస్‌ ఎలా బతుకుతుందని సీఎం ప్రశ్నించారు. కరోనా గురించి ఎవరు అసత్యాలు, దుష్ప్రచారాలు చేయరాదని దీనిపైన ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories