చికెన్, గుడ్లు తింటే కరోనా రాదు : సీఎం కేసీఆర్

చికెన్, గుడ్లు తింటే కరోనా రాదు : సీఎం కేసీఆర్
x
Highlights

కరోనా వైరస్ ప్రభావంతో సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్ హల్‌చల్ చేస్తున్నాయి. చికెన్, గుడ్లు తింటే కూడా కరోనా వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం...

కరోనా వైరస్ ప్రభావంతో సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్ హల్‌చల్ చేస్తున్నాయి. చికెన్, గుడ్లు తింటే కూడా కరోనా వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో జనాలు చికెన్, గుడ్లు తినడానికి వెనకాడుతున్నారు. అయితే చికెన్, గుడ్లు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని సీఎం కేసీఆర్ చెప్పారు. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనేది తప్పుడు ప్రచారమని సీఎం కేసీఆర్ చెప్పారు.

సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. చికెన్‌ తింటే కరోనా వైరస్‌ వస్తదని అందరూ ప్రచారం చేస్తున్నారు. చికెన్‌, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చికెన్ తినొద్దని కొందరు దుర్మార్గులు చేసే ప్రచారాన్ని నమ్మొద్దు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సీ విటమిన్‌ ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మ, సంత్రాలు, బత్తాయితో పాటు దానిమ్మ పండ్లు రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు బాగా ఉపయోగపడుతాయి. మామిడి పండ్లు కూడా బ్రహ్మాండంగా తినొచ్చు అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories