Top
logo

కాళేశ్వరం డీపీఆర్‌ను అసెంబ్లీలో పెట్టలేదు: భట్టి

కాళేశ్వరం డీపీఆర్‌ను అసెంబ్లీలో పెట్టలేదు: భట్టి
Highlights

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ మార్చి కాళేశ్వరం...

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేశారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. కాళేశ్వరం డీపీఆర్‌ను ఇంత వరకు అసెంబ్లీలో పెట్టలేదన్నారు. ప్రాజెక్టు టెండర్లు ఇరిగేషన్ వెబ్ సైట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు సంబంధిండిన డీపీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట ప్రయోజనాల కంటే కూడా కుటంబ ప్రయోజానాలకే పాల్పడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పక్క రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్న తెలంగాణ సర్కార్‌కి రాష్ట్రంలో ఉన్న నేతలెవరూ కనిపించడంలేదా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ అవినీతిపై ప్రశ్నిస్తారన్న కారణంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు.

Next Story


లైవ్ టీవి