చింతమడకలో సీఎం కేసీఆర్.. ఫోకస్ మొత్తం హరీశ్ రావు పైనే..

చింతమడకలో సీఎం కేసీఆర్.. ఫోకస్ మొత్తం హరీశ్ రావు పైనే..
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామం సిద్దిపేట జిల్లా చింతమడక సభలో పాల్గొన్నారు. కేసీఆర్ రాకతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కేసీఆర్...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామం సిద్దిపేట జిల్లా చింతమడక సభలో పాల్గొన్నారు. కేసీఆర్ రాకతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ సభాప్రాంగణం చేరుకునే ముందు అక్కడి గ్రామస్తులు కేసీఆర్‌కి ఘనస్వాగతం పలికారు. ఇక అక్కడి గ్రామస్థులతో కలిసి ముచ్చటించారు. తన చిన్నప్పటి మిత్రులతో కలిసి సరదాగా ముచ్చటించారు. అలాగే చింతమడక గ్రామస్థుల తీసుకొచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం సభాప్రాంగణం చుట్టు తిరుగుతూ ప్రతి ఒక్కరిని మందలిస్తు వచ్చారు. కేసీఆర్ చూసి అక్కడి గ్రామస్థులలో చిరునవ్వులు పులకరిచాయి. కాగా కేసీఆర్ సభప్రాంగణం చుట్టు తిరుగుతున్న క్రమంలోనే కేసీఆర్ పక్కనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కూడా ఉన్నారు. ఇక దీంతో దృష్టి హరీశ్ రావు పైనే పడింది.

సభాప్రాంగణానికి చేరుకున్న తరువాత సీఎం కేసీఆర్ పక్కనే హరీశ్ రావు కూర్చున్నారు. వారిద్దరు పలు అంశాలపై కూడా చర్చించుకోవడం గతాన్ని గుర్తుకుతెచ్చింది. అయితే ఇన్నిరోజులు ఎమ్మెల్యే హరీశ్ రావును సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని, అందువల్లే హరీశ్ రావుకి మొన్నటి మంత్రివర్గంలో చోటు దక్కలేదని జోరుగా ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో హరీశ్ రావు బీజేపీలోకి జంప్ అవుతారు అని కూడా ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ప్రచారం దూమ్మురేపిన విషమం తెలిసిందే. ఈ విషయంపై హరీశ్ రావు ఖండించిన విషయం కూడా తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ఎమ్మెల్యే హరీశ్ రావు, సీఎం కేసీఆర్ కలయిక అభిమానులను తెగ సంతోషపరిచాయి. అయితే నేటి కార్యక్రమానికి కేసీఆర్ వస్తున్నారని మూడు, నాలుగు రోజుల ముందుగానే సభ ఏర్పాట్ల నుండి ప్రతి ఒక్కటి హరీశ్ రావు దగ్గరుండి చూసుకున్నారు. మొత్తానికి మామా - అల్లుళ్ల కలయిన సన్నివేశం ఇటు పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులను ఆనందపరిచాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories