స్వామీజీ పేరుతో తెరవెనుక బాగోతాలు.. బట్టబయలు చేసిన పోలీసులు

స్వామీజీ పేరుతో తెరవెనుక బాగోతాలు.. బట్టబయలు చేసిన పోలీసులు
x
Highlights

టెక్నలాజి పెరుతున్న ఈ రోజుల్లోనూ ప్రజలు మూఢ నమ్మకాలను, బాబాలను నమ్ముతున్నారు. ఇదే అదనుగా కొంత మంది అమాయక ప్రజలను వంచిస్తున్నారు. ఇటువంటి ఓ స్వామీజీని చిట్యాల పోలీసులు అరెస్ట్ చేశారు

టెక్నలాజి పెరుతున్న ఈ రోజుల్లోనూ ప్రజలు మూఢ నమ్మకాలను, బాబాలను నమ్ముతున్నారు. దీంతో దొంగ బాబాలు, స్వామిజీలు ప్రజల విశ్వాసాలను ఆసరాగా తీసుకుని అక్రమాలకు, మోసాలకు పాల్పడుతూనే వుంటున్నారు. అంతే కాకుండా డబ్బులు దండుకుంటూ మాయ మాటలు చెప్పి కొందరి జీవితాలను రోడ్డున పడేలా చేస్తున్నారు.

ఇదే తరహాలో చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో స్వామిలోరిని అని చెప్పుకున్న ఓ వ్యక్తి భాగోతాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తనకు ఎన్నో శక్తులు ఉన్నాయని చెప్పుకుని.. ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకున్తున్నాడు శ్రీకాంత్ అనే వ్యక్తీ. చాలా కాలంగా ఈ ప్రాంతంలో శ్రీకాంత్ స్వామి అని అందరూ నమ్ముతున్నారు. అలా అతను అక్కడ తన పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత నుంచి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నాడు.. కానీ ఆధ్యాత్మిక ముసుగులో ఉన్న అతని అరాచకాలు ప్రజలకు అర్థం కాలేదు. ఇతను తన వద్దకు వచ్చే మహిళలు, యువతుల్లో కొంతమంది తొ భక్తీ ముసుగులో అరాచకాలకు పాల్పదేవాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించి దానికి భక్తి.. దేవుడు అనే ముసుగులు కప్పేవాడు. ఇదే క్రమంలో వారితో తాను ఉన్నప్పుడు ఫోటోలు తీసేవాడు. ఇలా చాలా కాలంగా జరుగుతూ వస్తోంది.

ఇటీవల కాలంలో శ్రీకాంత్ స్వామీజీ అవతారం విషయం పోలీసులకు ఉప్పందింది. శ్రీకాంత్ మహిళలు, యువతులతో ఉన్న సందర్భంలో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎవరో షేర్ చేశారు. అవి అలా..అలా.. పోలీసుల వరకూ వెళ్ళాయి. దీంతో చిట్యాల పోలీసులు ఈ విషయంపై విచారణ ప్రారంభించారు. సదరు దొంగ స్వామీ శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి ప్రస్తుతం తమ శైలిలో విచారణ చేస్తున్నారు.

దొంగ స్వామీజీల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలు హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories