EAMCET Entrance Exams: షెడ్యూల్‌లో మార్పు..పరీక్షలు ఎప్పుడో తెలుసా?

EAMCET Entrance Exams: షెడ్యూల్‌లో మార్పు..పరీక్షలు ఎప్పుడో తెలుసా?
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) షెడ్యూలులో మార్పులు తీసుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) షెడ్యూలులో మార్పులు తీసుకొచ్చారు. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సెట్స్‌ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ సాంకేతిక కారణాలు, రంజాన్‌ నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది మే 5, 6, 7 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ పరీక్షను మే 4వ తేదీ నుంచి నిర్వహించనున్నామని తెలిపారు. ఈ పరీక్షలను 4వ తేదీన రెండు సెషన్లుగా, 5వ తేదీన ఒక సెషన్‌గా, 7వ తేదీన రెండు సెషన్లుగా నిర్వహించనున్నామన్నారు. అంతే కాకుండా 8వ తేదీని కూడా ఎంసెట్‌ పరీక్ష నిర్వహణ కోసమే రిజర్వు చేశామని, ఇంజనీరింగ్ పరీక్ష రాసే విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లయితే 8వ తేదీన వారికి నిర్వహిస్తామని తెలిపారు. ఇకపోతే మే 25వ తేదీన లాసెట్, పీజీ లాసెట్‌ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ రంజాన్‌ నేపథ్యంలో లాసెట్, పీజీ లాసెట్‌ పరీక్షలను మే 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. అదే కోణంలో మే 27 నుంచి పీజీ ఈసెట్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా సవరించిన షెడ్యూలు ప్రకారం మే 28వ నుంచి 31వ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ పరీక్షలు అయినందునా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇక ఇదే తరహాలో నిర్వహించే ఆన్లైన్ పరీక్షల్లో ఎంసెట్‌ (అగ్రికల్చర్‌) పరీక్ష, పీఈ సెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్‌ పరీక్షలను ప్రకటించిన తేదీల్లోనే నిర్వహిస్తామని తెలిపారు. దీంతో పాటుగానే ఉన్నత విద్యా మండలి వారు కొత్తగా ఫేషియల్‌ రికగ్నైష న్‌ పద్ధతిని తీసుకురానున్నారు. దీని ద్వారా ప్రవేశ పరీక్షల్లో ఒకరికి బదులు ఒకరు పరీక్షలు రాసే విధానానికి స్వస్థి పలకనున్నారు. పరీక్షల్లో దరఖాస్తుల సమయంలో విద్యార్థుల ముఖం, కళ్లు స్కాన్‌ చేసి, వాటి ఆధారంగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టాలని భావి స్తున్నామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories