Telangana: నేరెడు చర్లలో చైర్మన్ ఎన్నిక వాయిదా..

Telangana: నేరెడు చర్లలో చైర్మన్ ఎన్నిక వాయిదా..
x
Highlights

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను సోమవారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో కూడా చైర్మన్ ఎన్నిక చేస్తున్నారు.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను సోమవారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో కూడా చైర్మన్ ఎన్నిక చేస్తున్నారు. ఇక ఈ ఎన్నిక సమయంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావును లోనికి అనుమతించడంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వారిని లోపలికి అనుమతించడంతో టీఆర్ఎస్ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీపంలో ఉన్నమైక్ను విరగ్గొట్టి, చేతిలో ఉన్న పేపర్లను కూడా చించేసారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అక్కడే ఉండడంతో ఎమ్మెల్యే సైదిరెడ్డికి, ఉత్తమ్ కు ఇద్దరికీ మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఇకపోతే కేవీపీకి ఓటు హక్కు కల్పించడంతో టీఆర్ఎస్ అభ్యంతరం తెలుపుతూ పార్టీ ఛైర్మన్ఎన్నికను వాయిదా వేయాలని కోరింది.ఈ నేపథ్యంలోనే రిటర్నింగ్అధికారి ఎన్నికను మంగళవారానికి (జనవరి 28) వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ఇకపోతే నేరేడుచర్లలో మొత్తం 15 వార్డులుండగా.. టీఆర్ఎస్7, కాంగ్రెస్7, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించాయి. ఇందులో కాంగ్రెస్, సీపీఎం కూటమిగా ఉన్నాయి. కాంగ్రెస్నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. టీఆర్ఎస్నుంచి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. కాగా విభజన అనంతరం ఎంపీ కేవీపీని తెలంగాణకు కేటాయించారు. టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, కాంగ్రెస్ ఎంపీ హనుమంతరావు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఓటు వేయడానికి ఎంపీ కేశవరావుకు అనుమతిని ఇచ్చి, హనుమంతరావుకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ఆగ్రహవ వ్యక్తం చేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories