తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది ఎంత మొత్తమో తెలుసా? : కేటీఆర్

తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది ఎంత మొత్తమో తెలుసా? : కేటీఆర్
x
Highlights

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ రూ.1.50 లక్షల కోట్లకుపైగా నిధులను రాష్ట్రానికి విడుదల చేసినట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం విదితమే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ రూ.1.50 లక్షల కోట్లకుపైగా నిధులను రాష్ట్రానికి విడుదల చేసినట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం విదితమే. ఈ గణాంకాలన్నీ ఫిబ్రవరి 10న లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వివరాలను వెల్లడించారు.

ఈ నిధులలో రాష్ట్రాల విపత్తు నిధి కింద రూ.1289.04 కోట్లు, పన్నుల వాటా కింద రూ.85,013 కోట్లు కేటాయించామని ఆమె స్పష్టం చేసారు. కాగా ఈ విషయంపై స్పందించిన కేటీఆర్ ఐదేళ్లలో రాష్ట్రం కేంద్రానికి ఎంత ఇచ్చింది, ఎంత తిరిగి తీసుకున్న విషయాలను ఆయన గణాంకాలతో సహా నిర్ధారన చేసారు. ఈ విషయాలను దేశ ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రజల కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేసారు. కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించిన ప్రతి పైసాను తిరిగి చెల్లించాలని తాను డిమాండ్ చేయడం లేదని కేటీఆర్ స్పష్టం చేసారు. భారత దేశం అనేక రాష్ట్రాల కలయిక అన్న కేటీఆర్, కేంద్రం-రాష్ట్రాల సంబంధాల విషయానికి వస్తే ఎవరూ ఇచ్చే వారు గానీ తీసుకునే వారు గానీ లేరన్నారు.

ఇక ఈ ఐదేళ్లలో తెలంగాణ కేంద్రానికి మొత్తం రూ.2,72,926 కోట్లు ఇచ్చిందని ఆయన తెలిపారు. కానీ కేంద్రం మాత్రం కేవలం రూ.1,12,854 కోట్లు మాత్రమే ఇచ్చిందని స్పష్టం చేసారు. ఇంకా రూ.1,60,072 కోట్లు మొత్తాన్ని కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ

ఇక పోతే ఈ గణాంకాలను ఏ ఏడాదికి ఆ ఏడాది చూసుకుంటే 2014-15లో తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో రూ.40,727 కోట్లు చెల్లిస్తే, కేంద్రం రూ.15,307 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. 2015-2016 సంవత్సరంలో రూ.52,250 కోట్లు ఇస్తే, కేంద్రం రూ.21,745 కోట్లు ఇచ్చిందని తెలిపారు. 2016-17లో రాష్ట్రం రూ.57,276 కోట్లు ఇస్తే, కేంద్రం రూ.24,628 కోట్లు ఇచ్చిందని స్పష్టం చేసారు. 2017- 18 సంవత్సరంలో తెలంగాణ రూ.52,996 కోట్లు చెల్లిస్తే, కేంద్రం రూ.24,479 కోట్లు ఇచ్చిందని తెలిపారు. 2018-19లో రూ.69,677 కోట్లు ఇస్తే రూ.26,695 కోట్లు ఇచ్చిందన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories