మేడారం చేరుకోనున్న పగిడిద్ద రాజు...స్వామి వారితో బయలుదేరినా పెనుక వంశస్థులు

మేడారం చేరుకోనున్న పగిడిద్ద రాజు...స్వామి వారితో బయలుదేరినా పెనుక వంశస్థులు
x
Highlights

మేడారం సమ్మక్క సారక్క జాతరలో భాగంగా మరికొద్ది సేపటిలో మేడారం గద్దెపైకి సమ్మక్క భర్త పగిడిద్దరాజు, సారక్క గద్దెలపైకి రానున్నారు.

మేడారం సమ్మక్క సారక్క జాతరలో భాగంగా మరికొద్ది సేపటిలో మేడారం గద్దెపైకి సమ్మక్క భర్త పగిడిద్దరాజు, సారక్క గద్దెలపైకి రానున్నారు. ఈ క్రమంలోనే గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పెనుక వంశస్తులు పగిడిద్దరాజును తీసుకుని కాలినడకన ప్రయణమయ్యారు. దట్టమైన కారడవి గుండా 66 కిలో మీటర్లు నడుచుకుంటూ ఈ కోయ పూజారులు పగిడిద్ద రాజును తీసుకువచ్చి గద్దెల వద్దకు చేరుకుని రాజును ప్రతిష్టించనున్నారు.

ఇదే నేపథ్యంలో కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులను సైతం తీసుకుని కోయ రాజులు అడవి మార్గం గుండా బయలు దేరారు. ఈ రోజు సాయంత్రం వరకు గద్దెల వద్దకు చేరుకుని సారక్కను, గోవింద రాజునుకూ ప్రతిష్టించనున్నారు. ఇక పోతే సమ్మక్క తల్లిని గురువారం రోజున గద్దెపైకి ప్రతిష్టించనున్నారు. అనంతరం ఇక్కడి గిరిజన పూజారులంతా కలిసి పూజలు చేసి దేవుళ్లకు మొక్కులు తీర్చుకోనున్నారు.

కాగా ఈ రోజున జరిగే ఈ ముఖ్య గట్టంలో భాగంగా పోనుగొండ్ల గ్రామస్తులంతా ఉదయాన్నే లేచి, తమ ఇళ్ల చుట్టుపక్కలను శుద్ది చేసుకున్నారు. వారి ఇంటి పరిసరాలను మట్టితో పూతపూసి, రంగురంగు ముగ్గులతో అలంకరించుకుంటారు. అనంతరం పెనుక వంశస్థులు కొత్త బట్టలు ధరించి, డోలు వాయిద్యాలతో ఇంటి నుంచి స్వామి వారిని కుంకుమ భరణి రూపంలో ఆలయానికి తీసుకొస్తారు. అక్కడ నుంచి పడగ రూపంలో అలంకరించిన స్వామివారి ప్రతిమను తీసుకుని అటవీ మార్గం గుండా కాలినడకన మేడారం గ్రమానికి బయలుదేరారు.

ఈ నేపథ్యంలోనే మేడారం ఆలయ అధికారులు, ప్రభుత్వ అధికారులు సమ్మక్క, సారక్క గద్దెలను ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పువ్వులతో అలంరించారు. ఈ వేడుకలను చేయడానికి వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేకంగా బెంగుళూరు నుంచి పువ్వులను తెప్పించారు. ఇక పోతే ఈ జాతరలో ఎంతోమంది భక్తులు హాజరవ్వడంతో పాటు, అది అటవీ ప్రాంతం కావడంతో ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చూడడానికి గాను సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో అక్కడి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష జిరిపి భద్రతలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని తెలిపారు. ఇక ఈ కుంభమేళాకు ఛత్తిష్‌ఘడ్‌ హోంమంత్రి కుటుంబంతో ఆలయానికి చేరుకుని మొక్కులకు తీర్చుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories