Cattle hostel : అన్ని సదుపాయాలతో పశువులకు హాస్టల్స్.. ఎక్కడో తెలుసా..?

Cattle hostel : అన్ని సదుపాయాలతో పశువులకు హాస్టల్స్.. ఎక్కడో తెలుసా..?
x
Highlights

Cattle hostel:పాఠశాల విద్యార్ధులు, కళాశాల విద్యార్ధులు, అలాగే ఉద్యోగం చేసుకునే వారి కోసం హాస్టల్స్ లో ఉండడం తెలుసు. కానీ ఇప్పుడు నోరు లేని మూగ జీవాల కోసం వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నారు.

పాఠశాల విద్యార్ధులు, కళాశాల విద్యార్ధులు, అలాగే ఉద్యోగం చేసుకునే వారి కోసం హాస్టల్స్ లో ఉండడం తెలుసు. కానీ ఇప్పుడు నోరు లేని మూగ జీవాల కోసం వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉందే అనుకుంటున్నారా. అసలు ఎక్కడ ఈ హాస్టల్లను నిర్మిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే పూర్తివివరాల్లోకెళితే తెలంగాణ లోని సిద్ధిపేటలో ఈ హాస్టల్లను నిర్మిస్తున్నారు. పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మంత్రి హరీష్ రావు చొరవతో గ్రామాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ హాస్టల్లలో పశువులను ఉంచడం వలన అవి అనారోగ్యానికి గురికాకుండా ఉంటాయని, పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని, పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహించవచ్చనే ఆలోచనతో పశువుల హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

ఇక ఇప్పటికే సిద్ధిపేట లోని ఇబ్రహీంపూర్, ఇర్కోడ్, నర్మెట గ్రామాల్లో సామూహిక గొర్రెల పాకలు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సమూహిక పాకల్లో గ్రామానికి చెందిన అన్ని గొర్రెలు ఒకేచోట ఉండడంతో కాపలా సులభం కావడంతో పాటు గ్రామాల్లోనూ పారిశుద్ధ్యం మెరుగుపడింది. దీంతో మంచి ఫలితాలు కూడా వచ్చాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హారీశ్రావు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఇదే తరహాలో పశువులకూ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే సిద్దిపేటలోని పొన్నాల, ఇరుకోడ్, మిట్టపల్లి, నర్మెట,గట్లమాల్యాల, ఇబ్రహీంపూర్, జక్కపూర్, గుర్రాలగొండి, గ్రామాల్లో ఈ పశువుల హాస్టల్ నిర్మాణాలు చేపట్టారు. ఈ ఒక్కో హాస్టల్‌ను సుమారు రూ.2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. అధికారులు కూడా త్వరలోనే వీటిని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇక ఈ పశువుల హాస్టల్లలో పశువులకు వానకాలంలో తడవకుండా రూఫ్, ఎండాకాలంలో ఫ్యాన్, చలికాలంలో పశువులకు చలి పెట్టకుండా చుట్టుపక్కల గోడలు, ఓపెన్ ఉన్న వైపు చిన్న టార్ఫాలిన్లను బిగించారు. ఏ సీజన్ లో ఐనా పశువులు అనారోగ్యం పాలు కాకుండా అధికారులు, పశువుల యజమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానికంగా పశువులకు హాస్టల్స్ ఏర్పాటు చేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories