logo

రేవంత్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

రేవంత్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Highlights

జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో మల్కాజ్‌గిరి ఎంపీ, టీకాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదైంది....

జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో మల్కాజ్‌గిరి ఎంపీ, టీకాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదైంది. ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్తూ జూబ్లీహిల్స్‌ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో రేవంత్‌రెడ్డి నివాసం వద్ద తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్‌ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి అతివేగంగా ఇంట్లో నుంచి బయటకు దూసుకొచ్చారు. ఆ సమయంలో అడ్డుకున్న ఎస్‌ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను నెట్టుకుంటూ, పక్కకు తోసేస్తూ అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై దూసుకుపోయారు. రేవంత్‌రెడ్డి నెట్టివేయడంతో తనకు గాయాలయ్యాయని ఎస్ఐ నవీన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 341, 353, 332 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top